WEATHER UPDATE : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14,15,16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో 14వ తేదీ నాటికి అల్పపీడనం గా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 14 15 16 తేదీలలో కోస్తా మరియు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఎటువంటి విపత్తు నైనా ఎదుర్కోవటానికి పోలీసులు విపత్తు నిర్వహణ అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. వెంటనే హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.
రానున్న 24 గంటలలో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం. మత్యకారులు, పొలాలలో పనిచేసే రైతులు, రైతు కూలీలు , పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే పొంగిపొర్లే వాగులు, కాలువలు, మాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భారీ వర్షాలకు నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏవైనా సమస్యలు ఉంటే 1070,112,18004250101 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది.
2 thoughts on “WEATHER UPDATE: ఏపీ లో 14,15,16, తేదిలో భారీ వర్షాలు”