AP NEWS: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇటీవల కాలంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చెబుతున్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కొంతమంది, పెట్రోల్ , డీజిల్ ధరలను భరించలేక మరి కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే పండు మినహాయింపు ఉంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పన్ను మినహాయింపును మరో ఆరు నెలలకు పొడిగిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది.
AP NEWS: అప్పుల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్
2024 డిసెంబర్ 7 వరకు ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నుల మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.2018-23 మినహాయింపు ఈవి విధానం స్థానంలో కొత్త విధానం అమలులోకి వచ్చేంతవరకు పన్ను మినహాయింపు పొడిగింపు పై నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల చట్టం 1963 కింద ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఎలక్ట్రిక్ బైకుల తో పాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఖర్చులు కూడా భారీగా కలిసి వస్తుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతోన్న విషయం తెలిసిందే.
One thought on “AP NEWS: ఈవీ వాహనదారులకు… ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.”