AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత, స్థానిక, సామాజిక అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకు వెళ్ళవచ్చునని గనుల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
పాత ఇసుక పాలసీ ప్రకారం… స్థానిక అవసరాల కోసం ఇసుకను కేవలం ఎడ్లబండ్ల ద్వారా తీసుకు వెళ్లడానికి అనుమతించేవారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేందుకు అనుమతిస్తూ ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులను జారీ చేసింది.
RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ… ఎద్దుల బండితో పాటు ట్రాక్టర్లతో కూడా ఇసుక తీసుకు వెళ్ళవచ్చు అని 2016 లోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీలో కేంద్ర పర్యాటక మార్గదర్శకాలను పాక్షికంగా అమలు చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, స్థానిక అవసరాల కోసం ఇసుకను కేవలం ఎద్దుల బండిలో మాత్రమే తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఈ పాలసీలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకువెళ్లేందుకు అనుమతి కల్పించలేదు.
తాజాగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ… ఇక రీచ్ ల నుంచి ఇసుకను ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా తీసుకువెళ్లవచ్చునని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులను జారీ చేశారు.
2 thoughts on “AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి”