AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీని అమలు చేసింది. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇక ఆలయాలలో రాజకీయ, అధికారుల జోక్యానికి చెక్ పడనుంది. ఇక ప్రతి గుడిలోనూ వైదిక కమిటీ ఏర్పాటు జరగనుంది. పూజలు, సేవలపై ఆ కమిటీదే తుది నిర్ణయం. ఆలయ ఆచార వ్యవహారాల్లో ఎవరి పెత్తనం ఉండకూడదు అని అంతా వైదిక ఆగమ శాస్త్రాల ప్రకారమే జరుగుతుందని ప్రభుత్వం సూచించింది.రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయాన్ని అమలు చేసింది.
AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం
దేవాలయలకు స్వతంత్రను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆలయ సాంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాలలో దేవాదాయశాఖ అధికారులతో పాటు ఆలయ ఈవోలు కూడా జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందిఈ మేరకు ప్రతి ఆలయంలో వైదిక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వైదిక కమిటీ యొక్క సూచనలు సలహాలను కమిషనర్ తో పాటు అధికారులందరూ అమలు చేయాల్సి ఉంటుంది.
ఆలయాల్లో కొత్త సేవలు ప్రారంభించడం, వాటి యొక్క ఫీజును నిర్ణయించటం, కళ్యాణోత్సవాల ముహూర్తాలు, యాగాలు, కుంబాభిషేకాలు, కొత్త పూజలు ప్రారంభించడంతోపాటుగా ఏ ఇతర ముఖ్య అంశాలలో వైదిక కమిటీ లేదా ఆలయ ప్రధాన అర్చకులు సూచనలు పాటించాలి.
ప్రధానంగా 6ఏ దేవాలయాల్లోని ఈవోలు వెంటనే వైదిక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కమిటీలు ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆగమాలకు సంబంధించిన పీఠాధిపతులు సలహాలు తీసుకోవాలని సూచించింది.
ఏ ఆలయ ఈవోలు సైతం ఆలయాలలోని వ్యవహారాలు, సేవలు, ముహూర్తాల ఖరారు వంటి విషయాలలో జోక్యం చేసుకోకూడదు అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
One thought on “AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం”