AP NEWS: YS జగన్ తిరుమల పర్యటన రద్దు … తో తిరుమలలో అనూహ్యపరిణామం
అప్పుడు లడ్డు వివాదం …ఇప్పుడు డిక్లరేషన్ వివాదం
ఏపీ రాజకీయాలలో ఇటీవల కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం మరువకముందే కొత్తగా డిక్లరేషన్ వివాదం తెరమీదకు వచ్చింది .
లడ్డు వివాదం :
తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యితోపాటు జంతువు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. అయితే అటువంటిది ఏమీ లేదని నెయ్యి నాణ్యత సరిగా లేని పరిస్థితులో ఆ నెయ్యి నీ రిజెక్షన్ చేయడం జరుగుతుందని టిటిడి చైర్మన్ తెలిపాడు. గత ప్రభుత్వంలో శ్రీవారి లడ్డు వినియోగంలో కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని , చంద్రబాబు నాయుడు కావాలనే ఆరోపాలు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. ఇలా తప్పుడు ఆరోపాలు చేయటం. శ్రీవారి భక్తులను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి లడ్డును తక్కువ చేయటం సరికాదని ఆయన తెలిపారు .
ఈ లడ్డు వివాదం మరువకముందే తెర మీదకు కొత్తగా డిక్లరేషన్ విభాగం వచ్చింది .
సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డుపై తప్పుడు ఆరోపాలు చేశాడని , ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఈ శనివారం రాష్ట్రంలో అన్ని గుడలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పూజలు చేయాలని జగన్ తెలిపాడు. తాను కూడా తిరుమల వెళ్లి శుక్రవారం రాత్రి అక్కడ బస చేసి శనివారం శ్రీవారిని దర్శించాలి అని అనుకున్నారు.
జగన్ తిరుమల పర్యటన రద్దు తరువాత "డిక్లరేషన్ ఫ్లెక్సీ "తీసివేస్తున్న @TTDevasthanams సిబ్బంది…
— Jagananna Connects (@JaganannaCNCTS) September 27, 2024
జగన్ను అడ్డుకోవడానికి దేవుడి పేరుతో రాజకీయం అంటే ఇది కాదా..?@TTDevasthanams staff removing "declaration flexi" after cancellation of Jagan's visit to Tirumala…
Isn't this… pic.twitter.com/9ssxJNN1dw
జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తున్నారని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఆ క్షణం నుంచి కూటమి నాయకులు మరియు కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ సమర్పించాలాని చెప్పింది. దీంతో హైందవేతరాలు శ్రీవారిని దర్శించాలి అనుకుంటే డిక్లరేషన్ సమర్పించాలని తిరుమల లో పలుచోట్ల ఫ్లెక్షీలు వెలిసాయి.
అయితే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నా మరుక్షణం టీటీడీ ఆ ఫ్లెక్షీలను తొలగించ్చింది. దీంతో YSRCP నాయకులు కూటమి ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుందని విమర్శిస్తోంది.