AP Free Gas Cylinder Scheme – ఉచిత గ్యాస్ సిలిండర్ల హామి అమలు దిశగా ఏపీ ప్రభుత్వం
Hassan Nasrallah : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతి
AP Free Gas Cylinder Scheme: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలు పై కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పౌరసరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఏపీలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కలెక్షన్లు ఉన్నాయని తెలిపింది. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటే 35 శాతానికి పైగా అంటే సుమారు 1347 కోట్ల కుటుంబాలు అర్హతను పొందుతాయి . ఉచితంగా వీరందరికీ ఒక సంవత్సరానికి మూడు సిలిండర్ల చొప్పున ఇవ్వడానికి సుమారుగా 3640 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది.
దీపం, ఉజ్వల మరియు ఇతర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు పొందిన 75 లక్షల మందికే ఈ పథకం అమలు చేస్తే సంవత్సరానికి 1763 కోట్లు అవసరమవుతుంది. సంవత్సరానికి ఖర్చు ఎంత అవుతుంది, అలాగే ఇతర రాష్ట్రాలలో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారు అనే నివేదికను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేస్తుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీ పలు సిఫారసులు చేసింది. సీఎం ఆమోదించాక ఈ పథకం యొక్క విధి విధానాలు వెలువబడుతాయి.
ఏపీ ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా సంవత్సరానికి ఒక్కొక్క ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపింది. ప్రస్తుతం ఒక్క గ్యాస్ సిలిండర్ ధర విజయవాడలో 825 రూపాయలుగా ఉంది. అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల చొప్పున ప్రస్తుతం ఉన్న గ్యాస్ ధర ప్రకారం ఒక కుటుంబానికి 200478 రూపాయలు మేరా ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన పథకం లాగానే రాష్ట్రంలోని పేద కుటుంబాలకు 1999 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని వాటిని ఉజ్వల యోజన కింద పరిగణలోకి తీసుకొని సిలిండర్ కు 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశాడు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దీపం మరియు ఇతర పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల కిందకు మారవచ్చు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి 585 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. అంటే ఐదు సంవత్సరాలకు ₹2,925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
One thought on “మహిళలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్ల హామి అమలు దిశగా AP Free Gas Cylinder Scheme”