AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బలి తీసిన వివాహేతర సంబంధం

AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బాలి తీసిన వివాహేతర సంబంధం

AP CRIME NEWS: వివాహేతర సంబంధం వీఆర్ఏ నిండు ప్రాణాన్ని బలి కొన్నది . సదరు వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను డిటోనేటర్లు, జిలేటిన్ స్టిక్స్ పేల్చి చంపిన ఘటన వైఎస్ఆర్ జిల్లా లో జరిగింది . స్థానికులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …

వేముల మండలంలోని వి కొత్తపల్లి అనే గ్రామంలో నివసించే ఎలంకూరు నరసింహులు 49 వృత్తిరీత్యా వీఆర్ఏగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు . నరసింహులు భార్య సుబ్బలక్ష్మమ్మ ముగ్గురాయి పనులకు వెళుతుండేది . అదే గ్రామానికి చెందిన బాబు అనే మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది . ఆ విషయం నరసింహ లకు తెలియడంతో బాబుకి , నరసింహులకు మధ్య నాలుగు నెలల కింద ఇద్దరూ గొడవ పడ్డారు .

AP NEWS TELUGU: లడ్డూ వివాదంపై దర్యాప్తు నిలిపివేచిన “సిట్ “

నరసింహులు

సుబ్బలక్ష్మమ్మ కూడా ఇటీవల తన పుట్టింటికి వెళ్లి ఈమధ్య తిరిగి వచ్చింది. ఆమెతో వివాహేతర సంబంధానికి నరసిం హులు అడ్డుగా ఉన్నాడని అతనిని ఎలాగైనా తొలగించాలని బాబు నిర్ణయించుకున్నాడు . బాబుకి ముగ్గురాయి గనుల్లో పేల్చే డిటోనేటర్లు జిలేటెన్ స్టిక్స్ తో అనుభవం ఉండడం వలన వాటితోనే హత్య చేయాలని నిర్ణయించాడు . ఆదివారం రాత్రి ఇంటి వరండాలో నరసింహులు , సుబ్బ లక్ష్మమ్మ వేర్వేరు మంచాలలో నిద్రపోయారు .

ఇదే అదునుగా బాబు , నరసింహులు మంచం కింద డిటోనేటర్లు జిలేటెన్ స్టిక్స్ పెట్టి పేల్చాడు . ఆ పేలుడు దాటికి భార్యాభర్తలకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి . 108 లో వేంపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నరసింహులు మృతి చెందాడు . సుబ్బ లక్ష్మమ్మ ను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు . దర్యాప్తు చేసిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఒక వ్యక్తిని చంపడానికి ఢీటోనేటర్లు , జిలేటెన్ స్టిక్స్ ఉపయోగించడం ఇదే మొదటి సారి అని పోలీసులు పేర్కొన్నారు .

One thought on “AP CRIME NEWS: వీఆర్ఏ ప్రాణాన్ని బలి తీసిన వివాహేతర సంబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *