AP CABINET: ఈ నెల ఆక్టోబర్ 10న ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. అందుకు సంబందించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు , ముఖ్య కార్యదర్శులకు , కార్యదర్శులకు నిర్దేశిత నమూన లో ప్రతిపాదనలను ఈ నెల 8 వ తేది సాయంత్రం 4 గంటలకు ప్రతిపాదనలను అందజేయాలని నీరబ్ కుమార్ తెలియజేసారు.
AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఈ క్యాబినెట్ భేటీ లో కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఎన్నికల హామీలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాజధాని అమరావతి , పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు , p-4 కార్యక్రమం అంశాలపైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అలాగే చెత్త పన్ను రద్దును క్యాబినెట్ లో ఆమోదించనున్నారు.
అదేవిధంగా , జల్ జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయిల ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. DSC నోటిఫికేషన్ కి సంబంధించిన అంశంపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ లో ఇప్పటికే టెట్ పరీక్షలు ఈ నెల 3 నుండి మొదలయ్యాయి. ఈ పరీక్షలు ముగియని వెంటనే డిసెంబర్ లో DSC నోటిఫికేషన్ కి ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
వీటన్నిటి తో పాటుగా జిల్లాల అభివృద్ధి అంశాలపైనా , కొత్తగా చేపట్టే అంశాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.