AP NEWS : కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. దీపావలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పతకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబర్ 24 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఉచిత సిలిండర్ల ను అందిస్తామని తెలిపారు. సిలిండర్ తీసుకునే సమయంలో ధరను చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన మొత్తాన్ని రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల అందరికీ వర్తింపజేయాలని, ఎటువంటి విమర్శలు లేకుండా సీఎం స్పష్టం చేశారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లా పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఒక సిలిండర్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు పౌరసరఫరా శాఖ కమిషనర్ వీర పాండ్యన్ వివరించారు
అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.