ap weather report:రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24వ తేదీన ఒడిశా – పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ తుఫాను కి దానా అని నామకరణం చేశారు..ఒడిశా తీరం వైపు నుంచి దూసుకు వస్తున్న దానా తుఫాను పై ఆందోళనలు నెలకొన్నాయి. అయితే,భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం… ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై దానా తుఫాను యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది.అక్టోబర్ 23వ తేదీన ఒరిస్సా తీరం వెంబడి తేలికపాటి నుంచి కురిసే అవకాశం ఉందని తెలిపింది .అక్టోబర్ 24, 25 తేదీల్లో ఒరిస్సా తీరం వెంబడి ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అటు పశ్చిమ బెంగాల్లో కూడా దానా తుఫాను యొక్క ప్రభావం అధికంగా ఉండనుంది.పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అక్టోబర్ 23వ తేదీన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కానీ అక్టోబర్ 24 25 తేదీల్లో పశ్చిమబెంగాల్లోని గోదావరి తీర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దానా తుఫాను ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అవ్వొచ్చని, విద్యుత్కు అంతరాయం ఏర్పడవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించండి.శిథిలావస్థకు చేరుకున్న ఉండకూడదని తెలిపింది.
దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయి, కానీ దానా తుఫాను యొక్క ప్రభావం అధికంగా ఉండకపోవచ్చునని తెలుస్తోంది . అక్టోబర్ 24 25 తేదీల్లో ఉత్తరకోస్తాలోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దానా తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్యకారులు వేటకు వెళ్ళిన వద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది . ఈ తుపానుకు దానా అనే పేరును సౌదీ అరేబియా ఇచ్చింది. “దానా” అనే పేరు అరబిక్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం “ఉదారత” లేదా “బహుమానం” అని వస్తుంది.
One thought on “ap weather report: ముంచుకొస్తున్న “దానా””