AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి.
అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడనున్నట్లు తెలిపింది. దాని ప్రభావం ఈ నెల 21 వరకు వర్షాలు అడగనున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో అక్టోబర్ 18వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండవచ్చు.