AP RAIN ALERT: వాతావరణ శాఖ మరొకసారి కీలకమైన అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22వ తేది నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి.
AP RAINS: వాయగుండంతో … విలవిలలాడుతున్న.. ఏపీ
అక్టోబర్ 20వ తేది నాటి కల్లా ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 22 నాటికి మధ్య బంగాళాఖాతం లో అల్పపీడనం గా మారడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బల పడుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు రాష్ట్రం లోని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఫలితంగా మరో ఐదు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ పేర్కొంది.