Tirupati : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు తెల్లవారుజామున నెల్లూరు, పుదిచ్చేరి మధ్య తీరం తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఈ భారీ వర్షాల ప్రభావం తిరుమల దేవస్థానం పై పడింది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందస్తు జాగ్రత్త రేపటి వరకు శ్రీవారి మెట్ల నడకదారిని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అదేవిధంగా పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
AP RAINS: వాయగుండంతో … విలవిలలాడుతున్న.. ఏపీ
స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా అకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రేపు చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 2500 హెక్టార్ల వరి పంట, 10 హెక్టార్ల కోత దశలోని వరి పంట, 4 హెక్టార్ల మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
వాయుగుండం ప్రభావంతో లో అన్నమయ్య జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరి బొప్పాయి, అరటి, టమోటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైల్వే కోడూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు, లక్కిరెడ్డిపల్లి, వీరబల్లి మండలాలలో 45 హెక్టార్ల వరి పంట తీవ్రంగా దెబ్బతింది. రైల్వేకోడూరు, పెనగలూరు మండలాలలో 10 ఎకరాలు బొప్పాయి, 2 ఎకరాలు అరటి, ఒక ఎకరా టమోటా పంట దెబ్బతిన్నది.