AP RAINS: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం చెన్నైకి 280 కి. మీ, పుదుచ్చేరికి 320, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
AP HEAVY RAINS: ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్.. 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్
పశ్చిమ వాయువ్యదిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దీని ప్రభావం తో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైస్సార్ జిల్లాలలో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని అధికారులు తెలిపారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సంగం బ్యారేజి 12 గేట్లు ఎత్తి నీటిని సముద్రం లోకి విడుదల చేశారు.
నెల్లూరు తీర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్, సముద్ర తీర గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, ఏదైనా అత్యవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించాడు. ముప్పునకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.మరో 48 గంటలకు అప్రమత్తం గా ఉండాలని తెలిపారు.
నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం లోని గొల్లపల్లి వద్ద పందుల వాగు ఉదృతం గా ప్రవహిస్తుంది. చేజెర్ల, తూర్పుకంభంపాడు మధ్య నల్ల వాగు ఉదృతం గా ప్రవహిస్తుడండంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల తో రాజంపేట, గుండ్లూరు, పాటూరు సహా పలు గ్రామాలలో వందలాది ఎకరాల్లోని వరి పంట నీటమునిగింది.
వైస్సార్ జిల్లా లో భారీ వర్షాలు కొట్టుకుపోయిన వంతెన. వీరపనాయినిపల్లె మండలం లోని బుసిరెడ్డిపల్లె లో కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయింది. దీంతో బుసిరెడ్డిపల్లె, వీఎన్ పల్లె కు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల ప్రభావం తిరుమల దేవస్థానం పై పడింది. భారీ వర్షాల కారణంగా రేపు తిరుమల నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల దర్శనాలకు, వసతికి ఎటువంటి ఇబ్బందులు కలపకుండా టీటీడీ జాగ్రత్తలు చేపట్టింది. భారీ వర్షాల దృష్ట్యా ఘాట్ రోడ్ లోని కొండచరియాలపై నిఘా ఉంచారు టీటీడీ అధికారులు.
2 thoughts on “AP RAINS: వాయగుండంతో … విలవిలలాడుతున్న.. ఏపీ”