AP HEAVY RAINS: బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ
జిల్లావ్యాప్తంగా పామూరు, పొన్నలూరు, ఒంగోలు, సింగరాయకొండ మండలాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. గుండ్లకమ్మ, కొత్త వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సింగరాయకొండ, కొత్తపట్నం ఒంగోలు, టంగుటూరు మండలాలలో 8 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.
ఈ భారీ వర్షాలు కారణంగా ఈరోజు కూడా ప్రభుత్వ ప్రైవేటు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు అధికారులు. జిల్లా కలెక్టర్ రెవిన్యూ అధికారులు వర్షాలు పడుతున్న ప్రాంతాలను పరిశీలించారు. జొన్న, సజ్జ పంటలకు తీవ్ర నష్టం ఏర్పడే విధంగా కనిపిస్తోంది. బాపట్ల జిల్లా రెండో రోజులుగా వర్షాలకు కురుస్తున్నాయి.
బాపట్ల,చీరాల,వేటపాలెం, చిన్నగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు,చుండూరు,వేమూరు అద్దంకి,యుద్దనపూడి,నిజాంపట్నం,కర్లపాలెం పట్టణంలో వర్షాలు కురుస్తున్నాయి.చీరాలలో కలుస్తున్న వర్షాలకు రహదారులు అన్నీ జలమయం అయ్యాయి.
2 thoughts on “AP HEAVY RAINS: భారీ వర్షాలకు ప్రకాశం, బాపట్ల జలమయం”