Heavy Rain : ఏపీని మరోసారి వాన గండం వెంటాడుతుంటుంది. ఏపీ వైపు మరో తూఫాను దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటలలో బలపడి వాయుగుండం మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
HEAVY RAIN: ఏపికి వాన ముప్పు
దక్షిణ కోస్తా తీరం వెంబడి 35 – 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులకు ఇస్తాయని హెచ్చరించింది.
ఇక నెల్లూరు , ప్రకాశం జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఆరంజ్ అలెర్ట్, బాపట్ల, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. చిత్తూరు కడప జిల్లాలతో సహా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చిత్తూరు, కడప, తిరుపతి అన్నమయ్య జిల్లాలలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపండి.
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయినా ఏపీ తాజాగా పొంచి ఉన్న తుఫాను ముప్పుతో అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, ఆనకట్టలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముందుగానే చెరువులు, వాగులు, రిజర్వాయర్లులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఈ భారీ వర్షాల ప్రభావం తిరుమల దర్శనాలపై పడింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు ఈనెల 16 తేదీన విఐపి బ్రేక్ దర్శనాలకు రద్దు చేస్తూ ఆదేశాలను తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అదేవిధంగా జెసిబిలను, అంబులెన్స్లను, డాక్టర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు. అన్ని శాఖల అధికారులకు సెలవులను రద్దు చేశారు.ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
One thought on “Heavy Rain: ఏపీకి 16, 17 తేదీలలో భారీ వర్షాలు”