Heavy Rain: ఏపికి భారీవర్షాలు

Heavy Rain

నెల్లూరు జిల్లాలలో ఇందుకూరి పేట, కోవూరు, కొడవలూరు మండలాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 0861-2331261, 7995576699 , 1077 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. సముద్రతీరా ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. పుస్తకాలను వేటగా వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవును ప్రకటించారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో ఒంగోలులోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కృష్ణాజిల్లాలో ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. విశాఖపట్నంలో పళ్ళుచోట్ల కురిసిన వర్షాలకు రహదారులు జలమయం అయ్యాయి. అన్నమయ్య జిల్లాలోనూ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవును ప్రకటించారు.

One thought on “Heavy Rain: ఏపికి భారీవర్షాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *