RAILWAY TRACK: ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలే లక్ష్యంగా చేసుకొని వరుస ఘటనలు జరిగాయి. అయితే ఈ ఘటనలో లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండటం వలన ఘోర ప్రమాదాలు జరగకుండా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ఘటన మరువకముందే ఉత్తరాఖండ్ లో మరొక ఘటన జరిగింది.
WEATHER UPDATE: ఏపీ లో 14,15,16, తేదిలో భారీ వర్షాలు
తాజాగా ఉత్తరాఖండ్ లోని రూర్కి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉండటం తీవ్ర కలకలం రేపింది. గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తం అవడంతో ఘోర ప్రమాదం తప్పింది.
రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం… ఉదయం 6:35 గంటలకు లలాండౌర్ – ధంధేర మధ్య ఈ ఘటన జరిగింది. స్టేషన్ సమీపానికి వస్తున్న సమయంలో లోకో పైలట్ రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉండటానికి గమనించారు వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ అధికారులను కూడా అప్రమత్తం చేశాడు. అధికారులు ఆ సిలిండర్ను ఘటనా స్థలానికి దూరంగా తీసుకువెళ్లి దానిని పరిశీలించగా అది ఖాళీ సిలిండర్ అని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో స్థానిక పోలీసులు జిఆర్పి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో వరుస రైలు కట్టనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రైల్వే ట్రాకులపై ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులు నిఘా పెంచారు
One thought on “RAILWAY TRACK: పట్టాలపై గ్యాస్ సిలిండర్… తప్పిన ఘోర ప్రమాదం !”