Ap Deputy CM Pavan Kalyan : దివ్వెల మాధురి సంచలన కామెంట్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. అసలు ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.
వైఎస్ఆర్సీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ , దివ్వెల మాధురి వ్యవహారం రోజుకో విధంగా మలుపు తిరుగుతుంది. దివ్వెల మాధురి పై TTD విజిలెన్స్ నమోదు అవడం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తిరుమలలో ఎవరువంటి రీల్స్ కానీ ఫోటోషాట్స్ కానీ చేయలేదని మరొక సారి స్పష్టం చేశారు. అయితే ఈ వివాదం లోకి కొత్తగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
Rain Alert: ఏపీ కి పొంచివున్న తుఫాను ముప్పు
దివ్వెల మాధురి తాజాగా… నాపై తప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. నేను దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి, మరికొంత మంది కార్యకర్తలతో పాటు అక్టోబర్ 7న తిరుమల వెళ్ళాం. అక్టోబర్ 7 ఉదయమే మేము దర్శనం చేసుకున్నాం, అయితే మాకు కొంత మంది మీడియా ప్రతినిధులు కనబడి ఫోటోలు తీసుకున్నారు.
అదే రోజు సాయంత్రం మాడ వీధుల్లో మేమూ మాతో పాటు కొంతమంది కార్యకర్తలు ప్రదక్షిణలు చేస్తున్నాము. అదే సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు మా వెంట వచ్చి నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. ఆ సమయంలో నేను ఎటువంటి రీల్స్ కానీ ఫోటోషూట్ కానీ చేయలేదు. నేను రీల్స్ మరియు ఫోటోషూట్ చేశానని చెబుతున్నారు. అది నిజం కాదు. నేను అక్టోబర్ 7న తిరుమలకు వెళితే… నాపై పదవ తారీఖున కేసు నమోదు చేశారు.
నేను 9వ తారీకు పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపాలకు నాపై కేసు పెట్టారు. ఇది కుట్రపూరిత కేసు మాత్రమే. ఇవన్నీ తప్పుడు ఆరోపాలు మాత్రమే, నేను “కోర్టులో చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాను” అని ఆమె అన్నారు.