AP NEWS: ఆంధ్రప్రదేశ్ అప్పుల లో కూడా అగ్రగామిగ నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ప్రకారం 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది పై అప్పుల భారం ఉన్నట్లు పేర్కొంది.అయితే అప్పులు తీసుకున్న వారిలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజలే 4.30% అధికంగా ఉన్నారు.
AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం
పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలే 32.86%, పురుషులలో 1.56% ఎక్కువ ఉన్నారు. అప్పన్న పట్టణ మహిళల కంటే పురుషుల సంఖ్య 21.69% ఎక్కువగా ఉండగా, గ్రామాలలో మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో పురుషులకంటే మహిళలే 7.49% ఎక్కువగా ఉన్నారు.దేశంలోని మరి ఏ రాష్ట్రంలోనూ అప్పులలో పురుషులను సంఖ్యను మించి మహిళలు లేరు.
అయితే ఈ సర్వే 2022 జూన్ నుంచి 2023 జూన్ వరకు నిర్వహించే నాటికి కనీసం 500 రూపాయలను రుణం తీసుకొని చెల్లించని వారందరినీ రుణ గ్రహీతల కింద పరిగణలోనికి తీసుకున్నారు.ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది ప్రజలపైనే ఎక్కువ అరుణ భారం ఉన్నట్లు తేలింది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ప్రతి లక్ష మందికి 11,844 మంది పైన మాత్రమే రుణ భారం ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో ప్రతి లక్ష మందిలో 20 వేలకుమించి రుణవారం లేదు.