Ap Weather Report: తాజా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం… ఒక అల్పపీడనం అరేబియా సముద్రంలో కొనసాగుతుంది. కర్ణాటక, గోవా దగ్గర కొనసాగుతోంది. ఇది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉంది. ఒక ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడింది.
Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి
ఇది ప్రస్తుతం తమిళనాడు దగ్గర కొనసాగుతోంది. అదేవిధంగా మరొక ఉపరితల ఆవర్తనం ఈ నెల 12న దక్షిణ బంగాళాఖాతం లో పశ్చిమం వైపున ఏర్పడే ఛాన్స్ ఉంది.ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ, యానం లలో ఈ నెల 14,15,16 తేదీ లలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
శాటిలైట్ అంచనాల ప్రకారం… శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘవృతం గా ఉంటుందని, మధ్యాహ్నం 2 నుంచి తేలిక పాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. సాయంత్రానికి రాయలసీమ, తెలంగాణ , హైదరాబాద్ లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది.
ఏపీలో గాలివేగం గంటకి 12 కిలోమీటర్లు గా ఉంటుందని, తెలంగాణలో 13 కిలోమీటర్లు గా ఉంటుందని, అదేవిధంగా బంగాళాఖాతంలో 19 కిలోమీటర్లు గా ఉంటుందని తెలిపింది.