AP DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.
AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు
ఏపీలో ప్రస్తుతం టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ టెట్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత అంటే నవంబర్ 2న టెట్టు పరీక్షా ఫలితాలు వెలువడుతాయి. టెట్ పరీక్షా ఫలితాల అనంతరం అనగా నవంబర్ 3న డిఎస్సీ నోటిఫికేషన్ కి రంగం సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం.
ఈ మెగా డీఎస్సీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇందులో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశించాడు.
2024 డీఎస్సీ సిలబస్ లో ఎటువంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిలబస్ కి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.