AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు

AP WEATHER REPORT: ఆంధ్ర ప్రదేశ్ ని ఇటీవల కాలంలో వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాలకు గురిచేశాయి. వాతావరణ శాఖ మరొక సారి ఏపీకి హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి మరో మూడు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు

అరేబియా 1 , బంగాళాఖాతంలో 2 తుఫానులు ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటి ప్రభావితం లో అక్టోబర్ 10 నుంచి ఏపీలో వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ తుఫానుల ప్రభావంతో కోస్త జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెపిలింది.

అయితే ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగడం తో మరో 3 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అక్టోబర్ లో మరో మూడు తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీ ప్రజలను హెచ్చరించింది.

2 thoughts on “AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *