Nobel Prize 2024:వైద్య శాస్త్రం లో విశేష కృషికి గాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం ఇరువురికి లభించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్ స్ర్కిప్షనల్ జీవ్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపు పురస్కారం వీరిని వరించింది.
Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు
ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న కరోలిన్ స్కా ఇంస్టిట్యూట్ లోని నోబెల్ బృందం ప్రకటించింది.
విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లు మైక్రో ఆర్‌ఎన్‌ఏ , జన్యు నియంత్రణ లో విశేష పరిశోధనలుకు గాను మెడిసిన్ లో నోబెల్ అవార్దు గెలుచుకున్నారని అవార్డు ప్రధాన సంస్థ సోమవారం తెలిపింది.
ఇప్పటికివరకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించారు. దీనిని 227 మంది అందుకున్నారు. అయితే ఇందులో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ నోబెల్ బహుమతుల పురస్కార ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగుతుంది.
IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్
మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం , గురువారం సాహిత్య విభాగం , శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి , చివరి రోజున అక్టోబర్ 14 న అర్ధశాస్త్రం లో నోబెల్ గ్రహీతల పేర్లను తెలపనున్నారు.
నోబెల్ అవార్డు గెలుచుకున్నవారికి 10 లక్షల డాలర్లు అంటే ( 11 లక్షల స్వీడిష్ క్రోనర్ లు ) నగదు అందుతుంది. గత సంవత్సరం వైద్య శాస్త్రం లో Covid-19 వాక్సిన్ అభివృద్ధి చేసినందుకు హంగేరి అమెరికన్ కాటలిన్ ,కరికో, హంగేరియన్ శాస్త్రవేత్త డ్రూ వీస్‌మాన్ లు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1896 లో మరణించాడు. తరువాత స్వీడిష్ డైనమైట్ ఆవిష్కర్త , వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు తో ప్రతి సంవత్సరం ప్రపంచంలో వివిఐద రంగాలలో వినూత్న సేవలందించిన వారికీ 1901 నుంచి నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు.
2 thoughts on “Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు”