AP government: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరదలు కల్లోలాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించింది. వరద బాధితులకు గుర్తించి వారి ఖాతాలో వరద సాయం కింద డబ్బులు వేసింది.
ఇప్పటి వరకూ 98 శాతం మంది బాధితులకు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 2 శాతం మంది వరద బాధితులకు డబ్బులు జమ కావాల్సి ఉంది.
అయితే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు మరియు ఇతర కారణాల వలన సుమారుగా 21 వేల మంది బాధితులకు వరద సాయం అందలేదు. వీరందరికి కలిపి 18 కోట్లు వారి ఖాతాలో జమ చేయనుంది. ఈ కార్యక్రమం స్థానిక జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది .
AP VOLUNTEER : వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్.. చెప్పనున్న ఏపీ ప్రభుత్వం
విజయవాడ వరదల కారణంగా సుమారు నాలుగు లక్షలమంది నష్టపోయారని అంచన. వారందరికీ వరద సాయం విడుదల చేసింది.
వరద సాయం కింద సుమారుగా 602 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే చాలా మంది కి వారి ఖాతాలో డబ్బు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 98 శాతం మందికి డబ్బులు జమ అయ్యాయి. మిగిలిన 2 శాతం మందికి వివిధ కారణాలతో డబ్బులు జమ కాలేదు. వారందరికీ సోమవారం అందిస్తామని తెలిపింది.