iran-israel war: హెజ్ బొల్ల అధినేత హాసన్ నస్రల్ల ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడుల్లో హాసన్ నస్రల్లా తో పాటుగా అతని కూతురు కూడా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు హాసన్ నస్రల్లా అల్లుడు కూడా మరణించినట్లు సమాచారం.
Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?
ఇజ్రాయిల్ సిరియాలోని డమాస్కస్ లో మజ్జే జిల్లాలో నివాస భవనాలను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. వారిలో హాసన్ నస్రల్లా అల్లుడు హాసన్ జాఫర్ ఆల్-ఖాసిర్ కూడా ఉన్నాడని సిరియా మానవ హక్కుల అబ్జార్వేటరీ తెలిపింది. అయితే , దీనిని హెజ్ బొల్ల మీడియా ద్రువీకరియించాల్సి ఉంది.
ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్నా దాడుల్లో అమెరికా పౌరుడు ఒకరు మృతి చెందినట్లు USA తెలిపింది . మిచిగాన్ లోని డియర్ బోర్న్ కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ మరణించినట్లు అమెరికా తెలిపింది. జావెద్ మృతి తమకు ఎంతో బాధ కలిగించిందని , అతని కుటుంబసభ్యులకు అండగా ఉంటామని వైట్ హౌస్ పేర్కొంది.
లెబనాన్ పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో వృద్దులకు, వికలాంగులకు సహాయం చేయడానికి బయటకు వెళ్లారు. అయితే, అదే ప్రాంతంలో క్షిపణి దాడులు జరగడం వలన తన తండ్రి మరణించారని కమెల్ అహ్మద్ జావెద్ కుమార్తె తెలిపింది.