Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?

పశ్చిమాసియా లో దాడుల కారణంగా …

Petrol Prices:లెబనాన్ లోని హెజ్ బొల్ల స్థావరాలను లక్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు , ప్రతిదాడులుగా ఇరాన్ ఈ బుధవారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్షిపణులను గగన తలంలోనే పేల్చేసింది ఇజ్రాయెల్ . ఈ దాడుల నేపధ్యలో అంతర్జాతీయం గా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం తో తీవ్ర ఆందోళనలు తలెత్తాయి. వీటి ప్రభావం చమురు ధరలపై పడింది.

israel iran war: ఇజ్రాయిల్ పై 200 క్షిపణి దాడులు చేసిన ఇరాన్

గత రెండు రోజులగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరిగాయి. చమురు ధరలు మంగళ,బుధ వారాలు వరుసగా పెరిగి రెండు వారాల గరిష్ట స్థాయికి చేరింది.

భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?

భారతదేశం లో ఇప్పటికిప్పుడు పెరగ పోయిన … ఇలాగే కొనసాగితే భరతదేశంలో కూడా పెట్రోల్,డీజిల్ మొదలగు ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేయడం వలన చమురు పెరుగులకు కారణమైందని ప్రస్తావించారు.

ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేయవచ్చునని వార్తలు ముందేవచ్చాయి . చమురు సరఫర చేసే దేశాలలో పశ్చిమాసియా కీలకంగా ఉంటుంది. ఒకవేళ పశ్చిమాసియా లో యుద్ధం వస్తే చమురు డిమాండ్ తగ్గుతుంది. అలాగే ఈ ప్రాంతాలలో చమురు ఉత్పత్తి కూడా తగ్గుతుంది అనే భయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటియికే ఇంధన సరఫరా తగ్గడం వలన చమురు ధరలకు రెక్కలొచ్చాయి.

ఈ విధంగా ధరలు పెరుగుతూ పొతే ఈ ప్రభావం భారత్ పై పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే చమురు విషయంలో భారత్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతుంది. ఒకవేళ అధిక ధర పెట్టి చమురును కొనుగోలు చేయాల్సి వస్తే ఆ భారాన్ని దేశం లోని వాహనదారులపై మోపాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయి అని నిపుణులు అభిప్రాయపడ్డారు.