గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ప్రతినెలా న్యూస్ పేపర్ కొనుగోలుకు రూ.200 ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకుంది. ఈ ఉత్తర్వులను మంగళవారం గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.

అయితే, గత ప్రభుత్వం వాలంటీర్ లకు రూ.5000 వేతనంతో పాటు న్యూస్ పేపర్ కొనుగోలుకు రూ.200 ల చొప్పున చెల్లించాలని ఉత్తర్వులను జారీచేసింది. 

తాజాగా ఏపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయం సిబ్బందికి షాకిచ్చింది. న్యూస్ పేపర్ కొనుగోలుకు కేటాయించిన రూ.200 అలెవెన్స్ లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు న్యూస్ పేపర్ సరఫరా చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం అదనంగా రూ.200 చెల్లించాలని

నిర్ణయం తీసుకుంది.

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ప్రతినెలా రూ.200 న్యూస్ పేపర్ కొనుగోలుకు నిర్ణయించింది.2022 జూన్ 29 న (ఆర్టీ నెంబర్ 12) ను జారీ చేసింది. ఈ నిర్ణయం ఓ దిన పత్రిక సర్కులేషన్ తో పాటు ప్రతి నెల కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని ఆ సంస్థ కు దోచిపెట్టే నిర్ణయంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అలవెన్స్ లను రద్దు చేస్తూ ఉత్త్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *