AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఏపీలో న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం న్యూస్ చెప్పంది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ను త్వరలోనే పూర్తి చేస్తాను హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రకటించారు.slprb.ap.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు.
అనేక కారణాలతో నిలిచిపోయిన ఎంపిక ప్రక్రియకు అధికార ప్రభుత్వం వలన విముక్తి కలిగిందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయటం పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని హోంశాఖ మంత్రి అనిత తెలియజేశారు.
6100 కానిస్టేబుల్ పోస్టు ల భర్తీ కి సంబంధించిన శారీరిక సామర్ధ్య( PMT, PET) పరీక్షలను ఐదు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి అనిత స్పష్టంగా తెలియజేశారు.
2022 లో జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 95,209 మంది అభ్యర్థులు మాత్రమే తదుపరి దశ పరీక్షకు ఎంపికయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు ఇతర కారణాల వలన పరీక్షలు వాయిదా పడ్డాయి.
పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ ( Civil-3580) ఖాళీ లు , కానిస్టేబుల్ ( APSP-2520) ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వాయిదా పడింది.3622 మంది హోంగార్డులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాక వారిలో 382 మంది మాత్రమే అర్హత పొందారు. అర్హత సాధించిన హోంగార్డులలో 100 మంది హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రత్యేక క్యాటగిరిగా హోంగార్డులను పరిగణించాలని , హోంగార్డ్ కోటా లో ప్రత్యేక మెరిట్ ను ప్రకటించాలని కోర్టును కోరారు.ఆ 100 మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తరం జారీ చేసింది.అయితే గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండానే నియామక ప్రక్రియను ఆపివేసింది.
ఇది కూటమి ప్రభుత్వం దృష్టికి చేరడంతో న్యాయ సలహాలు తీసుకొని, నియామక ప్రక్రియ ను రెండవ దశ( PMT, PET) నుంచి కొనసాగించాలని నిర్ణయించింది.రెండవ దశకు సంబంధించిన అప్లికేషన్ లు పూర్తి చేయటానికి, అలాగే నియామక ప్రక్రియ పూర్తి వివరాలను తెలుసుకోవడానికి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ slprb.ap.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తాను అని హోం శాఖ మంత్రి అనిత తెలిపారు.
రెండవ దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు మూడవ దశలో ప్రధాన పరీక్ష ఉంటుందని తెలియజేశారు.
2 thoughts on “AP News : కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం”