Supreme court: తిరుమల లడ్డు పై నేడు విచారణ
తిరుమల శ్రీవారి లడ్డు వివాదం మరింతగా ముదురుతోంది. తిరుమలలో కల్తీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఈ వ్యవహారంలో సెట్ కూడా దూకుడు పెంచింది. ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే. తిరుమలలో నిజాలు బయటకు వచ్చేలా చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అటు అధికారపక్షం, ప్రతిపక్షాల నేతల మధ్య మాటలతో యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే నేడు సుప్రీం కోర్టులో శ్రీవారి లడ్డు కేసు విచారణకు రానుంది. దీనిపై జస్టిస్ బి. ఆర్ గవాయి, కె.వి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ చేపట్ట నుంది. తిరుమల శ్రీవారి కల్తీ విషయంలో నిజాలు నెగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై నిజాలు తెలియజేయునందుకు సుప్రీంకోర్టు దర్యాప్తు జరపాలని బిజెపి మోత సుబ్రహ్మణ్యస్వామి పిటీషన్ దాఖలు చేశారు. వీటితోపాటు పలువురు ప్రముఖులు వేసిన పిటిషన్ల పై న్యాయస్థానం విచారణ జరపనుంది.
అయితే తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. శ్రీవారికి నిత్యం కోట్లాది రూపాయల కానుకలను భక్తులు సమర్పించుకుంటారు. అత్యంత ఆదాయం కలిగిన దేవాలయాల్లో శ్రీవారి ఆలయం మొదటి స్థానంలో ఉంది. వీటన్నిటితో పాటు శ్రీవారి లడ్డు ప్రసాదం కు ఎంతో విశిష్టత , ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డు ప్రసాదాన్ని సామాన్య భక్తుడి నుంచి ప్రధానమంత్రి వరకు ఇష్టపడతారు.