దేవర లో ఎన్టీఆర్ నటనపై కళ్యాణ్ రామ్ ప్రసంసలు
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం దేవర. తాజాగా అయినా ఈ చిత్రం ఎన్టీఆర్ ఫాన్స్ ను మెప్పించింది. ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన దేవర చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల జోరు కురిపిస్తుంది. ఈ క్రమంలో దేవరాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ దేవర చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి ఇలా అన్నాడు.
దేవర సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు మా నాన్న ( ఎన్టీఆర్ ) నటనతో అదరగొట్టేశాడు. దేవరలో తన పాత్ర వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు అని నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పాడు.
Devara : దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది
అనంతరం చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ…దేవర ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా సమయం నుండి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ కష్టం వల్లే ఈ సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి అని కొరటాల శివ అన్నారు.
దేవర చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కూడా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉంటుంది.ఈ సినిమాను ఎన్టీఆర్ వన్ మాన్ షో తో నడిపించాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమా లు కూడా అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికీ కారణమైన హీరోలకు దర్శకులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. అని దిల్ రాజు అన్నారు.