Devara : దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది

ఆ సెంటిమెంట్ కు దేవర బ్రేక్ వేసింది

దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది

Devara Movie Review: ‘దేవర’ మూవీ రివ్యూ ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఎలా ఉందంటే

రాజమౌళి పైన పడ్డ సెంటిమెంట్ ను దేవర బ్రేక్ చేసిందనే చెప్పాలి.

devara review : రాజమౌళి గురించి ప్రత్యేకం గా చెప్పనవసరంలేదు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి. తన దర్శక నైపుణ్యం తో తెలుగు పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కి పేరు తెచ్చాడు ఈ దర్శకదీరుడు.

అలాంటి రాజమౌళి కి కూడా ఒక సెంటిమెంట్ వేటాడుతూనే ఉంది. అయితే ఆ సెంటిమెంట్ కు దేవర బ్రేక్ వేసింది. రాజమౌళి సినిమా తర్వాత హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా, అది డిజాస్టర్ గా మిగులుతుంది. ఇందుకు ఉదాహరణలు కూడా లేకపోలేదు. బాహుబలి తరువాత ప్రభాస్ ‘ సాహో ‘ డిజాస్టర్ మిగిలింది. అదేవిధంగా ఆర్ ఆర్ ఆర్ తరువాత రామ్ చరణ్ నటించిన ఆచార్య కూడా డిజాస్టర్ గా మిగిలింది.

అదేవిధంగా ఎన్టీఆర్ నటించిన దేవర కూడా డిజాస్టర్ గా మిగులుతుందని అంత అనుకున్నారు. కానీ దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. ఈ రోజు ఉదయం రిలీజ్ అయ్యి భారీ విజయం దిశగా అడుగులు వేస్తుంది.

రాజమౌళి కొడుకు కార్తికేయ సైతం…. ఎవరైతే రాజమౌళి సెంటిమెంట్ ను సృష్టించారో వారే మళ్లీ బ్రేక్ చేసారు. అంటూ X వేదిక గా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.

One thought on “Devara : దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *