అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. కమలహరిస్ మరియు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి వారిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై కాల్పులు తరచుగా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం పై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యాలయం సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కార్యాలయం కిటికీల వద్ద నుంచి జరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు అర్థ రావడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.
ఇక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన కూడా వరుస కాల్పులు జరగటం అందరికీ తెలిసిందే. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న సమయంలో నిందితులు ఫామ్ బీచ్ లో ఫెన్సింగ్ వద్ద నుంచి కాల్పులు జరపడంతో గమనించిన భద్రత సిబ్బంది కాల్పులు జరిపిన నిందితుడని అదుపులోకి తీసుకున్నారు రెండు నెలల క్రితం కూడా ట్రంప్ ఎన్నికల సమయంలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ కాల్పులలో ట్రంప్ కుడిచేవి పైభాగం నుంచి తూటా దూసుకు వెళ్ళింది.తాజాగా కమలహార్రీస్ డెమొక్రటిక్ పార్టీ కార్యాలయం పై కాల్పులు జరగడం సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.