AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం … ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడేఅవకాశం.
కట్టుకున్న భార్య కోసం ఏకంగా ఐలాండ్ కొనేసిన దుబాయ్ భర్త
ఇటీవల కాలంలో కట్టుకున్న భార్యలను కడతేరుస్తున్న భర్తల గురించి చూశాం. అలానే భార్యల కోసం ఎన్నో త్యాగాలు చేసిన భర్త ల గురించి కూడా చూశాను.. కానీ ఇక్కడ ఒక భర్త తన భార్య నచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఎవరు చూడకుండా ఉండేందుకు, ఆమెకోసం ఒక ఐలాండ్ నే కొన్నాడు.
విచిత్రంగా ఉందా ? అయితే ఈ కథ చదవాల్సిందే.
దుబాయ్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదా కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్లు పెట్టి హిందూ మహాసముద్రంలో తన భార్య కోసం ఒక ఐలాండ్ ను కొనుగోలు చేశాడు.
దుబాయ్ చెందిన సౌదీ అల్ సదక్ కథనం ప్రకారం తన భర్త బీచ్ లో ఒక ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేశాడు. తాను బికినీ వేసేందుకు, ఇబ్బంది పడకుండా, మరియు సురక్షితంగా ఉండేందుకు ఐలాండ్ ని కొనుగోలు చేసాడని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది. కొన్ని భద్రతా కారణాల వలన ఈ ఐలాండ్ యొక్క ఖచ్చితమైన లొకేషన్ ని షేర్ చేయడం లేదు అని , ఇది మాత్రం ఆసియా ఖండం లోనే ఉందని తెలిపింది.
అంతే కాదు, ఇందుకు సంబందించిన వీడియో ను ఇంస్టాగ్రామ్ వేదిక గా షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ను దాదాపు 30 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వ్యవహారం పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
సౌదీ అల్ సదాక్ ఇంస్టాగ్రామ్,టిక్ టాక్ ద్వారా ఆమె లగ్జరీ స్టయిల్ బాగా పాపులర్. వీరికి పెళ్ళయ్యి మూడు సంవత్సరాలు.
One thought on “కట్టుకున్న భార్య కోసం ఏకంగా ఐలాండ్ కొనేసిన దుబాయ్ భర్త”